Thursday, April 21, 2011

టీవీ లో వ్యభిచారం (ఒక వ్యాఖ్యానం)...

ఈ మధ్యన గొల్లపూడి గారి ఒక వ్యాసం చదివాను. వివిధ వార్తా మాధ్యమాలలో సంభవిస్తున్న మార్పుల గురించి వారు అతి చక్కగా వారి భావాన్ని వ్యక్తీకరించారు. చదువర్లు ఆ వ్యాసాన్ని ఇక్కడ చూడొచ్చు http://www.koumudi.net/gollapudi/041811_gundayya_katha.html. అయితే గొల్లపూడి గారికి కొన్ని భావాలు ఉన్నట్టే నాకు కూడా కొన్ని ఆలోచనలు , ఒక దృష్టికోణము ఉన్నాయి. వారు ప్రస్తావించిన అంశం గురుంచి నేను చాల రోజుల నుంచి అలోచిస్తునాను. ఉదాహరణకు ఏదో టి.వి ఛానల్ లో ఒక డాన్సు ప్రోగ్రాం ప్రసారమవుతోంది. అందులో పాల్గొన్నవారి నృత్యప్రదర్శన కన్నా వారు ఒకరిని ఒకరు బూతు మాటలతో తిట్టుకోడమే కనిపిస్తూ ఉంటుంది. దీనినే గొల్లపూడి గారు వ్యభిచారమన్నారు. వారి వ్యాసం లో టి.వి చానల్స్ వారికి ఇటువంటి కార్యక్రమాల కన్నా సమాజానికి పనికొచ్చే కార్యక్రమాలు ప్రసారం చేస్తే బాగుటుందని సూచన. అయితే వ్యభిచారం అనేది నాణానికి రెండు వైపులలాంటిది. రెండు చేతులు లేకుండా చెప్పట్లు , అగ్గి లేకుండా పొగ ఎలా రావో, ఈ వ్యభిచారాన్ని ఇష్టపడే వాళ్ళు లేకుండా వ్యభిచారం చేసేవాళ్ళు కూడా ఉండరు. ఏ సాని నా ఇంటికి రా అని చెప్పదు, వెళితే వద్దు అనదు. ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతున్నప్పుడు వాళ్ళు కూడా ఏదో ఒక పని చెయ్యాలి. ఎకనామిక్స్ భాష లో చెప్పాలంటే ఇది supply and demand సిద్ధాంతం. కొనేవాళ్ళు ఉన్నంతవరకు అమ్మే వాళ్ళు ఉంటారు. ఈ సందర్భం లో నాకు ప్రేమాభిషేకం చిత్రం లో జయసుధ గారి మాటలు గుర్తు వస్తునాయి. ఎవరికీ నచ్చితే వారు రావొచ్చు , వారి తహుత బట్టి వారి ధర ఉంటుంది అనే మాటలు ఈ సందర్భానికి సరిపోతాయి.

ఇక టీవీ విషయానికి వస్తే , నా చిన్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చూసి ఎరుగను. అందరు నేను పెరిగినట్టుగానే ఆంజనేయ, శ్రీ కృష్ణ వంటి కార్యక్రమాలు చూడాలి అని కూడా చెప్పను. అయితే మా ఇంట్లో నే ( నేను ఇప్పుడు మా స్నేహితులతో ఉంటునాను) ఈ డాన్సు కార్యక్రమాలకి వీరాభిమానులు ఉన్నారు. వారికి టీవీ లో ఎవరయినా కొట్టుకొంటే సరదా. ఒకరు ఇబ్బంది పడుతూ ఉంటే చూసి ఆనందించడం మానవ నైజం అని ఎక్కడో చదివాను , మా ఇంట్లో చూస్తూ ఉంటాను (అప్పుడప్పుడు). MTV Roadies , ఈ రోజులలో గాంధీ గారి గురుంచి తెలియని భారతీయులు ఉంటారేమో కాని ఈ కార్యక్రం గురుంచి తెలియని వారు మాత్రం ఉండరు. ఆ ప్రోగ్రాం వచ్చే గంట లో అర గంట అంతా బీప్ బీప్ మనే శబ్దాలే. అయితే నా స్నేహితులకి , ఇప్పుడే ప్రాయం లో ఉన్న పిల్లలకి చాలా తేడా ఉంది. ఎలా అయితే గొల్లపూడి గారు ప్రస్తావించిన కార్యక్రమాన్ని చుసిన పెద్దవాళ్ళు "సరేలే ఈ టీవీ వాళ్ళకి ఇలా వాగడం తప్ప ఏమి రాదు" అనుకొంటారో , మా freinds కూడా దాన్ని అక్కడే వదిలేస్తారు. జీవితానికి , ఒక టీవీ కార్యక్రమానికి మధ్యలో గీత గీయడం వారికి తెలుసు. అయితే 13-14 ఏళ్ల వయసులో ఉన్న పిల్లలు , తర్కించే శక్తి , జ్ఞానం లేని వాళ్ళ సంగతి ఏమిటి ? ఇక్కడ తప్పు , టీవీ వాళ్లదా లేక అటువంటి కార్యక్రమాలని విశిదీకరించి చెప్పని పెద్దవాళ్ళదా ? నన్ను అడిగితే పెద్దవాళ్ళదే అంటాను.

విచక్షణ, తర్కం అనేవి చూసి నేర్చుకొనేవి. ఇవి ప్రతి సమాజానికి ఆ సమాజపు విలువలని బట్టి మారుతూ ఉంటాయి. America వాళ్ళ ఆలోచనా విధానం వారి జీవన సరళి కి సరిపోతుంది. ఈ రోజు మా రూంమేట్స్ ఈ కార్యక్రమాలని చూసి కూడా వాటి ప్రభావానికి లోనుకాకపోవడం వారికి ఇంగితజ్ఞానం నేర్పించిన వారి తల్లితండ్రుల కృషి కి నిదర్శనం. ఇటువంటి కార్యక్రమాలు , విలేఖర్లు ఉంటూనే ఉంటారు. ఈ రోజులలో ప్రతీది వ్యాపారమే. అటువంటప్పుడు వారిని నిందించి ప్రయోజనం ఏంటి ? ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది --- మన కర్మలకి మనమే కర్త. ఎటువంటి వార్తనైనా తర్కించి మంచిని చెడుని వేరు చెయ్యగలిగే తెలివిని మన పిల్లలకి కలిగించాలి .......

No comments: