Friday, May 28, 2010

my poetry (నేను వ్రాసిన కవితలు)

I am great fan of the Telugu language and no surprises here as it is my mother tongue. I wrote my first Telugu poem way back in my 8th class , but unfortunately don't remember it any more. However , I have kept track of every single poem (except one) after that and I post them here. Some of these poems are really good , as most of my friends have agreed. I know that there is a risk of plagiarism involved , but I wish to believe that people are ethical enough to acknowledge others' works and I like to trust them.

Here they go .

This was a kind of parting gift to one of my friends during my last semester at college.

సిగ్గులమొగ్గ పెదవి పై చిరు మందహాసం మన స్నేహం
పసిపాప బోసి నవ్వులోని లాలిత్యం మన స్నేహం
వసంత కోకిల గానం లోని మాధుర్యం మన స్నేహం .
తొలకరి అలంకరించిన పైరు అందం మన స్నేహం
ప్రాతః కిరణాలు సంధ్యా సమీరాల అనిర్వచనీయమైన అనుభూతి మన స్నేహం
ఆనందింపజేసిన బాధ పెట్టిన అది ఈ స్నేహానికే చెల్లింది
అటువంటి సుందర సుకుమార సుమనోహరమైన ఈ స్నేహం ఇలాగే నిలిచి ఉండాలని ఆశిస్తూ ..........

Volga resturant , pilani

The next is a combination , half of which was written by a close friend of mine and I completed the rest.

కలలోని కనబడిన కమ్మని కలవరమా ..
నా ఎదుట నిజముగా నిలిచిన ఓ వరమా ..

నిన్ను చూసిన పరవశమున
కనుల నుండీ వెల్లువాయే వెన్నెల వర్షం

నా పసి సంబరం చూసిన ఆ క్షణమున
నీ పెదవంచున విరిసేనొక చిరునవ్వు ముత్యం .

అద్దం లో నేను నీవుగా కనిపించిన వేళ ,
నీ మాటలే నా తలపులయ్యి , నీ శ్వాసలే నా నిట్టూర్పులయ్యి ,నా మది లో పొంగినదొక ఆనంద కెరటం .

వాన చినుకు నునులేత స్పర్శ నిన్ను గుర్తుచేస్తుంటే , మధుకోకిల కమ్మని గానం నీ పాటని తలపిస్తుంటే
నన్ను నేను మరచిన క్షణం అద్భుతం , అనిర్వచనీయం .

ఏమని చెప్పను ఎన్నని వర్ణించను , మది నిండా నీ ఆలోచనలే , రేయంతా నీ గురించి కలవరింతలే .
నీవు లేని క్షణాలను గడుపలేను , నిన్ను చేరి నీ ఒడి సేదతీరలేను .
మేఘ సందేశం లిఖించ కాళిదాసును కాను ,హంస రాయబారం పంప దమయంతిని కాను .
నా ఊహలకి అక్షర రూపం ఈ కవిత్వం , నన్ను నీకు చేర్చి నా మది నీ ముందుంచేది ఈ కవనం .


3 ) The first two lines are that of a song in Telugu and I wrote the rest. Of course the song is much better , but this is just an inspiration.

చిగురాకుల లేఖలు రాసి చిరుగాలి చేతికి ఇచ్చి ఎపుడో నే పంపించాను నువ్వు చూడలేదా ...
నా మనసే పడవగా చేసి కలలన్నీ అలలుగా చేసి ఎపుడో నే పంపించాను నిన్ను చేరలేదా ..
ప్రొద్దు గుక్కే వేళ నా మనసు నీతో ఉండాలని , నిదరోయే వేళ నా పలుకులు వినిపించాలని ..

పడమటి అరుణిమ నన్ను వెక్కిరిస్తోంది
గూటి కి చేరుతున్న గువ్వ నన్ను ప్రశ్నిస్తోంది
నీ జాబు రాక సన్నగిల్లిన ఆశ నన్ను వీడిపొతోంది ....

రాగాలు పలికే నా మనసే మూగబోయిన వేళ ,
అరవిచ్చిన మల్లియలన్నీ సొమ్మసిల్లిన వేళ
నీ తోడు లేక రేయి సాగనంటున్న వేళ,
నిశి కన్య నిద్రలేస్తున్న వేళ
మాటే కరువైన మౌనం ఇది భావం నిండిన భాష్యం ఇది.

4 ) తళుక్కుమనే తారలు ప్రశ్నించాయి వాటి దరహాసానికి సాటి ఏదని , నీ మందహాసం తెలియకనేమో
వయ్యారాలు పోయే మయూరి మిడిసిపడుతోంది తనకి పోటి లేదని, నీ నడకల సొగసులు చుడకనేమో
రాగాలు పాడే కోయిల వినలేదు తేనెలొలికే నీ గానం, సుకుమారులైన పూబాలలకు తెలియదు నీ స్పర్శ లోని లాలిత్యం
హంపి శిల్పం ఎరుగని హొయలు, అజంతా చిత్రం కనని వర్ణాలు ఉన్నాయా ఈ సృష్టి లో అనే ప్రశ్నకి సమాధానం
నీవే నా చెలివే

5 ) ఎవరివో నీవెవరివో
---------------------------------------------------------------

అజంతా శిల్పాల గ్రంధానివో , బాపూ చిత్రాల ప్రేరణవో
తెలుగు వారి ఎంకివో , నా మదినేల వచ్చిన సుర కాంతవో
కాశ్మీరు అందాల చిత్రానివో, తెలుగింటి లోగిళ్ళ మణిదీపానివో
ఎవరివో నీవెవరివో , ఏల ఈ దరి చేరావో, నా మదినేల దోచావో

ఏ దేవత దీవెనో ఈ కలయిక, నా మదిని ఆనందడోలికలాడించింన సుర గీతిక
వసంతమై వచ్చావు నా దరికి , శిశిరమై పోమాకు ఏనాటికి
నీ అధరామృతము చవిచూచాను ఈనాడు , నీ విరహాన్ని ఓపలేను ఇక ఏనాడూ
వాసంత సమీరంలోని చల్లదనం నీ మందహాసం, తారల కాంతుల కలబోతైన ఆ దరహాసం

నీ సాంగత్యమే నా జీవన గమ్యం , నీవు లేని నా ఉనికి ప్రశ్నార్ధకం
ఈ విరహానికి ఆవిరవుతున్న మంచుబిందువును నేను
నీ వలపుల చల్లదనానికి ఘనీభవించే వైనాన్ని చూడు


For those of you who can understand Telugu , I hope you enjoy these.

Prasad

No comments: